Listen to this article

జనం న్యూస్ 28 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక:విజయనగరం రూరల్‌ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు