Listen to this article

నిరుపేద కుటుంబనికి వరం ఇందిరమ్మ ఇల్లు

అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జన న్యూస్ ;28 మార్చి శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇల్లు కు గత నెలలో ikp ఆఫీస్ ఆవరణంలో వెనుక భాగం లో ప్రజలకు కనిపించకుండా నిర్మిస్తున్నారని అట్టి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి విషయాన్నీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ మరియు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ అన్న దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అదేవిధంగా వారి ఆదేశాలతో ప్రజల సౌకర్యార్థం ప్రజలు సంచరించే ప్రదేశంలో నిర్మాణం చేపట్టాలని అందుకోసం దానికి సరిఅయినా భూమికేటాయించాలని సంబంధిత అధికారులు చిన్నకోడూరు తహసీల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు వెంటనే స్పందించి తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఇందిరమ్మ మోడల్ ఇల్లు కు భూమి కేటాయించిన తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్షరాం, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు ఉడుత జయంత్ నాయకులు నముండ్ల వినోద్, నక్క రాజు, కల్లూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు