

జనం న్యూస్ మార్చి 28 సంగారెడ్డి జిల్లా,పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో గ్రామ యువకుడు గిరి ఆధ్వర్యంలో చలివేంద్రన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి విచ్చేసి అందరి సమక్షంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు, అనంతరం వారు మాట్లాడుతూ అనుకోకుండా వచ్చిన అతిథి లాగా వేసవి కాలంలో ఎండలు విపరీతంగా పెరగడంతో పాఠశాలలకువెళ్లే విద్యార్థులు, రహదారి వెంట వెళ్లే కాలి నడక దారులకు వాహన దారులకు చలివేంద్రం ద్వారా స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లను అందుబాటులోకి తేవడం చాలా సంతోషకరం అని అన్నారు. అలాగే రామేశ్వరం బండ గ్రామంలో, వికర్ సెక్షన్ కాలనీలో రెండు చలివేంద్రాలను కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గడ్డమీద ఆంజనేయులు, ఉప సర్పంచ్ కుమార్ గౌడ్, గ్రామ యువకులు సురేష్, అర్జున్, రమేష్, దానయ్య, ఇబ్రహీం, శంకర్, నవీన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.