

బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి
జనం న్యూస్ మార్చి 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలో గల గుమ్మడిదల మండలం వీరన్న గూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం తో ముగిశాయి. ఈ సందర్భంగా బొంతపల్లి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సహకరించిన డైరెక్టర్లకు ఆలయ అర్చకులకు సిబ్బందికి ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పటాన్ చేరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన పోలీసు వారికి అటవీ శాఖ, ఆలయ కమిటీ సభ్యులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమేష్,ఆలయ నూతన కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది,ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.