Listen to this article

జనంన్యూస్. 28 : నిజామాబాదు టౌన్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్. జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్ బిఎస్ ) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్లలోపు ఉండాలని అన్నారు. అర్హులైన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.