Listen to this article

జనం న్యూస్ మార్చి 28 కాట్రేని కోన :మహిళా సంఘాల సభ్యుల హక్కు, మరియు జీవనోపాధి కొరకు వార్షిక ప్రణాళిక 2025-2026 రుణ ప్రణాళిక అంచనా తయారు చేయడం కొరకు ఎంపిక చేసిన ఎన్యుమరేటర్ లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కాట్రిను కోన మండల మహిళా సమైక్య ఆఫీస్ నందు సభ్యులు ఆర్థిక ప్రణాళికలపై రెండో రోజు శిక్షణ కార్యక్రమం నకు ముఖ్యఅతిథిగా నూతనంగా ఎన్నిక కాబడిన ఎంపీపీ కోలాడి సత్యవతి, ఎంపీడీవో ఎన్ వెంకట చలం ,శ్రీనిధి ఏజీఎం ఏ ఎస్ ఓ, వెలుగు ఏపియం . పాల్గొని సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బిఫోర్ సర్వే కొరకు వివరించడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా 120 డ్వాక్రా సభ్యులు హాజరయ్యారు ఫీల్డ్ విసిటీ కూడా చేయడం జరిగింది…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు అవసరమైన జీవనోపాది, ఋణాల గురించి మండలంలో డ్వాక్రా సంఘాలను ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి ఐదు సంఘాలకు విద్యాధికురాళ్లను గుర్తించి ఎన్యూమరేటర్ లుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు….ఎన్యూమరేటర్లు గ్రామాల్లోని సంఘ సభ్యుల వద్దకు వెళ్లి మొబైల్ యాప్ ద్వారా కుటుంబ అవసరాలకు కావలసిన ఋణ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు… ఈ కార్యక్రమం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 7వ తేదీ లోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు…ఈ శిక్షణ కార్యక్రమంలో వెలుగు సిసి లు , విఓఏ లు, మండల మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.