

జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులను మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.శుక్రవారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..బహిరంగంగా మద్యం సేవించడం చట్టవిరుద్ధమని,బహిరంగంగా మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,బహిరంగంగా మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.ప్రజలు బహిరంగంగా మద్యం సేవించకుండా ఉండాలని, చట్టాలను గౌరవించాలని ఎస్సై ప్రజలను కోరారు.