

జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విశాఖలో లులు మాల్ భూమి లీజుపై ప్రభుత్వ నిర్ణయాన్ని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పారదర్శకత లేకుండా సుమారు రూ. 1300 కోట్ల ఆస్తిని ప్రైవేట్ సంస్థకు అప్పగించడం సమంజసమా? ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. వేల కోట్ల విలువైన ఆస్తిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం సరికాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిని బహిరంగంగా ప్రకటించాలన్నారు.