Listen to this article

జనం న్యూస్ 29 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్‌ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య (20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.