

జనం న్యూస్ పార్వతీపురం, మార్చ్ 29, రిపోర్టర్ ప్రభాకర్:
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని శనివారం ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జి, సహాయ కార్యదర్శి నాగభూషణం మాట్లాడుతూ..ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు, వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతులలో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలు చదివే వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తుందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగిందన్నారు, తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులతో కిటకిటలాడుతున్న యూనివర్సిటీలలో రాష్ట్రవ్యాప్తంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తీసుకోవడం వల్ల యూనివర్సిటీలో విద్యార్థులు లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో బాగుపరచాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్షను రద్దుచేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష హ యూనివర్సిటీ నిర్వహించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను పేదలకు దూరం చేసే విధంగా జీవో నెంబర్ 107 ,108 తీసుకువచ్చి వైద్య విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతుండడంతో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తూ ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్యను అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తుకు చేశారు, తక్షణమే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవి కుమార్ మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్ కి సొంత బిల్డింగ్ల కేటాయించి మరమ్మత్తుల్లో ఉన్న వాటిని పూర్తిచేయాలని కోరారు.గిరిజన విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు.