

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 29
తర్లుపాడు లో టిడిపి జెండా ను ఆవిష్కరించిన కందుల రోహిత్ రెడ్డి తర్లుపాడు మండలం లోని అన్ని గ్రామాలలో టిడిపి పార్టీ 43 వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిచారు తర్లుపాడు బస్టాండ్ సెంటర్ లో టిడిపి పార్టీ ఆవిర్బావ దినోత్సవానికి ముఖ్యఅతిధిగా మార్కాపురం నియోజకవర్గ యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి విచ్చేసి తెలుగువారి కీర్తిని పెంచిన బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన మహనీయుడు స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను కందుల రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు మిర్జెపేట గ్రామం లో నరసింహ, పెసల వెంకటేశ్వర్లు మరియు టిడిపి నాయకులు టిడిపి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య,కాళంగి శ్రీనివాసులు,టిడిపి యూత్ అధ్యక్షులు మేకల వెంకట్,ఎస్ యం సి చైర్మన్ వెన్నా రాజారామ్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు గౌతుకట్ల సుబ్బయ్య,టిడిపి నాయకులు ఈర్ల పెద్ద కాశయ్య, షేక్ అఫ్రోజ్,గోసు వెంకటేశ్వర్లు, షేక్ ఖాసీంవలి, ఈర్ల శ్రీను, జాన్ బనియన్, వనపర్తి నాగేంద్ర,దాసు తదితరులు పాల్గొన్నారు