Listen to this article

జనం న్యూస్, మార్చి 30, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

చెన్నై లో తన అధ్బుతమైన ప్రతిభ తో అబ్బురపరిచిన దామరకుంట విద్యార్దిని వరగంటి అశ్విని – ప్రభుత్వ పాఠశాలల మట్టిలో మాణిక్యo చిన్నారి అశ్విని, తల్లి 9 నెలలు గర్భములో మోసి జన్మనిస్తే ,అశ్విని తన తొమ్మిదవ తరగతి లోనే ‘ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు అయిన వై చిన్న బ్రహ్మయ్య గారు అందించిన జ్ఞానాన్ని మోసి, 125 మూలకాలను సంకేతాలతో సహా, అనితర సాధ్యం కానీ అతి తక్కువ సమయంలో అందరు మంత్ర ముగ్ధులు అయ్యేలా ప్రదర్శన చేసి భౌతిక -రసాయన శాస్త్రాన్ని అఖండ స్థాయికి చేర్చిన అశ్విని జ్ఞానం అమోఘం ,అద్భుతం . జాతీయగీతాన్ని పాడడానికి 52 సెకండ్స్ సమయం తీసుకుంటే 125 మూలకాలని మరియు సంకేతాలతో సహా కేవలం 58 సెకండ్స్ లలో పూర్తిచేసి అంతర్జాతీయ స్థాయికి మన సిద్ధిపేట జిల్లాని ,దామరకుంట కీర్తి ప్రతిష్టలని తీసుకెళ్లిన అఖండ దీపం అశ్విని . విజయం మరియు జ్ఞానం అనేది ఎకొక్కరి సొత్తు కాదు అని కడు పేదరికంలో జన్మించి కష్టాలని సైతము ఇష్టాలుగా మార్చుకొని చదువే ధ్యేయముగా జ్ఞానమే సర్వస్వముగా వెలిసి నిరూపించిన సరస్వతి దేవి మన అశ్విని .
ఇలాంటి ఆణిముత్యం ఎప్పుడు ముత్యముల మెరుస్తూ ఉండాలి అంటే అశ్విని కి అందరు సపోర్ట్ గా ఉంటూ , చిన్నారి తల్లిని ఆశీర్వదిస్తూ ఆకాశము అంత ఎత్తుకు ఎదుగనిద్దాము ,అందరమూ అశ్వినికి చేయూతనిద్దాము,
ఇలాంటి ఆణిముత్యాన్ని తయారు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలీ మెంటార్ వై చిన్న బ్రహ్మయ్య కి మరియు జిల్లా విద్యాశాఖాధికారి కి , జిల్లా సైన్స్ అధికారి,కి, జిల్లా విద్యా శాఖ పెద్దలకు మరియు పూర్తి సహాయ సహకారం అందించి ప్రోత్సహించిన ,స్థానిక మండల అధికారి ,ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రాములు,కి ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పి బాలరెడ్డి,కి ,అమ్మ ఆదర్శ కమిటీ, మరియు అభినందనలు తెలియపరచిన ఉపాధ్యాయ బృందం.