

జనం న్యూస్, మార్చ్ 29, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి :పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సుస్మిత అను మహిళకి అత్యవసరంగా ఏబి నెగిటివ్ రక్తాన్ని ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ ఎనుగందుల ఉదయ్ కుమార్ ని సంప్రదించగా పెగ్గర్ల గ్రామానికి చెందిన ఆక్టివ్ డోనర్ చెన్నవేని భానుచందర్ కి సమాచారం తెలుపగ భానుచందర్ వెంటనే స్పందించి మెట్ పల్లి పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది. అత్యంత అరుదుగా దొరికే రక్తం కాబట్టి అత్యవసర సమయంలో స్పందించి రక్త దానం చేసిన భానుచందర్ గారిని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రవి గారు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, తెలంగాణ ప్రాణదాతల సముహం – బాబుజన్ గారు, సామాజిక సేవకులు ఉదయ్ కుమార్, గోవర్ధన్ గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆగ సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాం ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఖుతుబద్ధీన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ – సుర్గి శ్రీనివాస్, జనహితం స్వచ్ఛంద సంస్థ – జెడి సుమన్, టీం SMF – అఖిల్, ప్రాణధాతలు సేవ్ ఫౌండేషన్ – మురళి, కుర్మా తిరుపతి ఫౌండేషన్ – తిరుపతి, రంజిత్, మహేష్ గారు తదితరులు అభినందించారు.