Listen to this article

జనం న్యూస్ మార్చ్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మైనింగ్ లో నా ప్రమేయం ఏమీ లేదని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు .స్థానిక బైపాస్ రోడ్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా మైంనిగ్ లో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు .వైసీపీ నాయకులు అమర్నాథ్ .ధర్మశ్రీ ఆ వాకులు చవాకులు పేలుతున్నారని అది అంతా అబద్ధమని చెప్పారు. మీడియా ఆధ్వర్యంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. అనకాపల్లిని అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఓర్వలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అధికారులు కూడా ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ఏ మైనింగ్ కార్యక్రమం జరిగిన చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు .విజిలెన్స్ ఎంక్వయిరీ చేపించాలని డిమాండ్ చేశారు .ఈ నెల 31న అచ్యుతాపురం అనకాపల్లి 100 అడుగుల రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారని తెలిపారు .పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రాంత సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు .కేంద్రీయ మంజూర అయిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు 4 లక్షల ఉద్యోగాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో అరకు కాపీని పెట్టడం జరిగిందన్నారు .ఏది ఏమైనాప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని సీఎం రమేష్ ప్రకటించారు .ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేష్ పాల్గొన్నారు.