Listen to this article

జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :శనివారం ఉదయం విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో పట్టణంలో కార్మిక వాడల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దుందుడకు విద్వంసకర విధానాలను అమలు చేయడం వలన శ్రామికవర్గ, ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆయన విమర్శించారు కార్పొరేట్ సంపన్నుల లాభాలు పెరిగిపోతున్నాయని ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉద్యోగ అవకాశాలు జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు అత్యంత ప్రమాదకరంగా వేగంగా పెరుగుతూనే ఉన్నాయని బిలియనీర్ల సంపద పెరుగుదల మనకు స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుందని మరోపక్క రెండు పూటలా ఆహారం తినడానికి ఇబ్బందులు పడుతూనే ప్రజలు జీవిస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశ బడ్జెట్ సంపన్న వర్గాలకు రాయితీలు ఉపయోగపడే విధంగా ఉంటుందని ప్రజా ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాల రంగంలో బడ్జెట్ కేటాయింపులు లేవని ఆయన దుయ్యబట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఏర్పడి శత వార్షికోత్సవాలు సందర్భంగా ఈ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య భారతదేశంలో నేడు మోడీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మరియు వందేళ్ళ సిపిఐ జెండా పట్టి ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక, రైతు చట్టాలకు తూట్లు పొడుస్తూ, లౌకిక తత్వాన్ని, ప్రజా సమస్యలను నీరుగారుస్తు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ మోడీ నియంతృత్వ విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తూ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేయడానికి మోడీ కుట్ర చేస్తున్నారు అని అన్నారు.మన రిపబ్లిక్ కీలకమైన లక్ష్యాలు, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, సమానత్వం, ఆశయాలను ప్రజలకు తెలియజేయడం కోసం సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు విప్లవ యువకిషోరం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ రాజకీయ ప్రచార జాతను ప్రారంభిస్తున్నామని ఇది ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగబోయే ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని బుగత అశోక్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ బలిజివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, కెల్ల సూర్యనారాయణ, పతివాడ శ్రీనివాసరావు, మజ్జి చిన్నా మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.