

ఎర్రబెల్లి సంపత్ రావు
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు..
జనం న్యూస్ // మార్చ్ // 31 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే మన్ కి బాత్ గొప్ప కార్యక్రమం అని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని 165 వ బూత్ (హౌసింగ్ బోర్డ్ కాలనీ)లో సంపత్ రావు బూత్ శ్రేణులతో కలసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ..నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఉండే అనేక రకాల విషయాలను ప్రజలకు తెలియజేయడం కోసం , మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3 వ తేదీన ప్రారంభించారని గుర్తు చేశారు. నేటి వరకు 120 ఎపిసోడ్ లల్లో అనేక రకాల కొత్త కొత్త విషయాలను, దేశ ప్రజల జీవన విధానంతో ముడిపడి వుండే అనేక విషయాలను, మన్ కి బాత్ “కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నదని తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేశంలోని కోట్లాది మందిని మన్ కీ బాత్ ద్వారా చైతన్యపరిచి, వారి జీవన విధానంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి వ్యక్తిగత నిర్మాణం, దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రజలను తయారు చేస్తున్నాడని సంపత్ రావు కితాబిచ్చాడు. ప్రతినెల చివరి ఆదివారం వచ్చే, మన్ కీ బాత్ ” కార్యక్రమాన్ని వీక్షించడం కోసం దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారని, తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చూసి నిత్య జీవితంలో ఉపయోగపడే అనేక విషయాలు తెలుసుకోవాలన్నారు. ప్రతి బిజెపి కార్యకర్త, మన్ కి బాత్ ” కార్యక్రమాన్ని వీక్షించి నరేంద్ర మోడీ చెప్పే విషయాలను ప్రజలకు తెలియజేయాలని సంపత్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు తోపాటు బిజెపి సీనియర్ నాయకుడు జీడి మల్లేష్, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు మదిరే రవీందర్, బిజెపి నాయకులు మోడం రాజు, బూరుగుపల్లి రాము, ఉడుగుల మహేందర్, 165వ బూత్ నాయకులు కొలను సంతోష్ రెడ్డి, భాష బోయిన కొమురయ్య, పసునూటి శివ, ముంజల సాయి, సతీష్,మంగ పురుషోత్తం, తోడేటి వంశీ,శ్రివర్థి ప్రవీణ్,మేడిపల్లి రమేష్, మసాడి లింగారావు,గోనె రమేష్, గండ్ర రాజు,లింగంపల్లి దేవేందర్, న్యాత రాజు,రేనుకుంట్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.