

జనం న్యూస్ కాట్రేనికోన, మార్చి 31 కాట్రేనికోన గ్రా మ దేవత మావుళ్ళమ్మ అమ్మవారికి నిమ్మకాయలు, పూల దండలతో శనివారం అమావాస్య పూజ నిర్వహించారు. ఆ లయ అర్చకుడు ఆణివిళ్ళ ఫణికాంత్శాస్త్రి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, సహస్ర కుంకుమార్చన జరిగింది. ఈపూజా కార్యక్రమంలో ఆణివిళ్ళ సాయిబాబా, శాంతాసుబ్బలక్ష్మి, గ్రంధి రాంప్రసాద్, పవన్‌కుమార్, శ్రీకాంతశర్మ, సుధీరశర్మ, బాపన్నశాస్త్రి, మంత్రి ప్రగడ శ్రీనివాస్, సంసాని వరప్రసాద్, తాతపూడి గోపి, చెరుకు బాపిరాజు, గ్రంధి నారాయణమూర్తి, గ్రంధి బ్రహ్మాజీ, చెరుకు రామకృష్ణ, ఆణివిళ్ళ రా మకృష్ణపరమహంస పాల్గొన్నారు. గ్రంధి నాగేశ్వరరావు, గ్రంధి నానాజీ, కు చ్చర్లపాటి సత్యనారాయణరాజు పులిహోర ప్రసాదం ఏర్పాటు చేశారు.