Listen to this article

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు..
ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశీని కోటి…

జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపెళ్లి లో 17 వార్డులో పరిధిలోని చౌక దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చేర్మెన్ దేశిని కోటి ప్రారంభించడం జరిగింది. అర్హులైన పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కోటి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి, ఉగాది రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడం, ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే మాట తప్పదు, అని అందులో భాగంగా మంగళవారం నాడు జమ్మికుంటలో సన్న బియ్యం అర్హులైన పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇ కార్యక్రమం లో దేషిని కోటి తో పాటు, మార్కెట్ వైస్ చేర్మెన్ సత్తిరెడ్డి, మరియు జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ రమేష్, మాజీ ఉపసర్పంచ్ దేషిని శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.