Listen to this article

సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప…..

బిచ్కుంద ఏప్రిల్ 1:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఉగాది నుండి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇది ప్రజా ప్రభుత్వ పాలన అని, బిచ్కుంద మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున అప్ప అన్నారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలో గాంధీ చౌక్ లో గల బాబా రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ప్రారంభించారు. రేషన్ డీలర్ నాయకులు కలిసి టెంకాయను కొట్టి రేషన్ లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించినందుకు లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ నౌషా నాయక్, సీమ గంగారం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, ఉత్తం మైనారిటీ నాయకుడు కలీం , లింగురా , తుకారం మండల కేంద్రంలోని రేషన్ డీలర్లు, రేషన్ షాపు పరిధిలోని రేషన్ లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.