Listen to this article

ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యం తాండ కనకయ్య గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)

ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యమని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ కనకయ్య గౌడ్ అన్నారు, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి అధ్యక్షతన, కాంగ్రెస్ నేతలు తిరుమల రెడ్డి,రఘుపతి,ఓంకార్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం తాండ కనకయ్య గౌడ్, మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు దశలవారీగా నెరవేరుస్తున్నారని అందులో భాగంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగిందని ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యమని రేవంత్ రెడ్డి, సర్కార్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంజీవ్, కాంగ్రెస్ నాయకులు బబ్బూరి అనిల్,యాదగిరి, బాల నరసయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు