Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

బీడీకార్మికులకు పెరిగిన కరువు భత్యం,(వి డి ఏ)రూ 10-40 పైసలు, వెయ్యి బీడీల కు అన్ని కలుపుకొని రూ 261-97 పైసలు.ఈ పెరిగిన కరువు భత్యం ఏప్రిల్ 1 నుండి బీడీ యజమానులు కార్మికులకు చెల్లించాల్సి ఉంటుంది.తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పని చేయు కార్మికులందరికీ మన యూనియన్ సంఘటిత పరచి పోరాడిన ఫలితంగా కరువు భత్యం వి డి ఏ అగ్రిమెంట్ 1994 సంవత్సరంలో సాధించుకున్నాం. ఈ సమాచారం ప్రకారం బీడీ కార్మికులకు నిత్య అవసరాలకు ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వం కరువు భత్యం వి డి ఏ పెంచుతుంది.కార్మిక సంఘాలతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2024 జనవరి నుండి డిసెంబర్ 2024 వరకు వినిమయ ధరల పెరుగుదల అనుగుణంగా 1809 పాయింట్ల నుండి 1913 పాయింట్ల కు పెరిగింది.అంటే 104 పాయింట్లు పెరిగింది. పాయింటు కు 10 పైసల చొప్పున కరువు భత్యం వి డి ఏ రూ 10-40 పైసలు పెరిగింది. ఈ పెరుగుదల ప్రకారం”వెయ్యి బీడీలకు ” అన్ని కలుపుకొని మొత్తం రూ 261-97పైసలు చెల్లించాలి. ఈ పెరిగిన కరువు భత్యం వి డి ఏ ను తెలంగాణ రాష్ట్రంలోని బీడీ యాజమాన్యం బీడీ కార్మికుల సంఘం కు తేదీ 01/04/2025 నుండి చెల్లించాల్సి ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సి పి ఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం అన్నారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్ పాల్గొన్నారు…..