

జనం న్యూస్ 01 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా యువ నాయకులు బండారి .రాజు మల్దకల్ మండలం కేంద్రము
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపైన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన అణిచివేత చర్య అని జిల్లా యువ నాయకులు బండారి రాజు అన్నారు…..తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలక్రమంలో అనేక పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది. అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప పోరాటం ఇది . హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం విద్యార్థులు పడుతున్న ఆరాటం చాలా గొప్పది’ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపైన, యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్నది? వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను, చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నది? ఎందుకు ఇంత వేగంగా భూముల కబ్జాకు ఆరాటపడుతున్నదో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.