

జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు.
పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రామచంద్రపురం ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్-ఉల్-ఫితర్. నమాజ్ అనంతరం రంజాన్ వేడుకలను ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెల రోజులపాటు కటోరమైన ఉపవాసా దీక్షలు ముగించుకొని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలని సామూహిక ప్రార్థనలు నిర్వహించి.అల్లాని వేడుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్. అబ్దుల్ ఘనీ సహాబ్. ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ సహాబ్ మాట్లాడుతూ. రంజాన్ పండుగ ప్రేమ శాంతి సోదర భావానికి ప్రతీక అని తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ అనంతరం అలయ్ బలయ్ తోఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో. ముస్లిం మత పెద్దలు యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
