

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 84 వ వార్డు విలీన గ్రామాలు సిరసపల్లిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సిరసపల్లి సత్తిబాబు కు డయాలసిస్ చేసుకున్న పేషంట్ కి ప్రతినెల పదివేల రూపాయలు కూటమి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాదంశెట్టి నీలాబాబు తెలియజేశారు. ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6 గంటలకు సిరసపల్లి గ్రామంలో సత్తిబాబు ఇంటికి వెళ్లి పదివేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శిరసపల్లి సన్యాసిరావు డి తాతారావు ఎస్. ప్రసాద్ షణ్ముఖ రాజు జి.సురేష్ డి.శ్రీను ఎం.సంతోష్ కుమార్ ఎస్. శ్రీను ఎం . లోవరాజు తదితరులు పాల్గొన్నారు.