

మద్నూర్ ఏప్రిల్ 1 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో గల ఈతకొలనులో మంగళవారం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వారి పిల్లలు తో కలిసి ఉల్లాసంగా ఉత్సవంగా ఈత కొట్టి సరదా తీర్చుకున్నారు. ఎండాకాలంలో ఈతకొలనులో ఈత కొట్టడంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. గత 15 రోజుల నుండి మద్నూర్ మండలం ఎన్ఆర్ఈజీఎస్ స్కీంలో భాగంగా సిసి రోడ్డు పనులు ముమ్మురంగా కొనసాగినాయని చాలా బిజీ షెడ్యూలు మార్చి 31 వరకు కొనసాగిందని తెలిపారు. ఈరోజు కొంచెం సమయం దొరకడంతో పిల్లలతో కలిసి ఈత కొలనులో ఈత కొట్టి సరదాగా పిల్లలతో గడిపినమని తెలిపారు.