

జనం న్యూస్,ఏప్రిల్1, జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం నేడు ప్రారంభోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేళ్ళ గోపాలరెడ్డి స్థానిక రేషన్ షాపులో లబ్ధిదారులకు సన్న బియ్యం పథకం ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలంతా చిరునవ్వుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.