

జనం న్యూస్ ఏప్రిల్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా పౌష్టిక విలువలు కలిగిన సన్న బియ్యం పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు
కాంగ్రెస్ పార్టీ మరియూ ముఖ్యమంత్రి స్ఫూర్తితో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి సూచన మేరకు,కూకట్పల్లి నియోజకవర్గంలోని కె పి హెచ్ బీ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సీఎం ఆదేశాల ప్రకారం రేషన్ దుకాణం ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని ఆనాటి టిఆర్ఎస్ నిన్నటి బి ఆర్ ఎస్ రేపటి విఆర్ఎస్ పార్టీ అని మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే కరీబి హటావో అనే బాటలో నడుస్తుంది. గతంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రోటి కపడ ఔర్ మకాన్ అనే నినాదం మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పట్ల వెన్నుదన్నుగా ఉంటుందని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండారగల్ల సంజీవ రావు, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, ఫణీంద్ర కుమార్, బి బ్లాక్ అధ్యక్షురాలు సంధ్య, రేష్మ, యమునా, దేవ సహాయం రవి, కొమ్ము బాబు, రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకురాలు యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.