Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట )

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జమ్మికుంట మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో, సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడతల ప్రణవ్ బాబు, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ..సర్దార్ సర్వాయి పాపన్న, ఆనాడే గెరిల్లా సైన్యాన్ని తయారుచేసి మొగులు చక్రవర్తులతో పోరాడి విజయం సాధించారు అన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటను కైవసం చేసుకొని కొన్ని సంవత్సరాలు పరిపాలన అందించారన్నారు.గొప్ప నాయకత్వ లక్షణాలున్న సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయ సాధనాల కోసం ఈనాడు మంత్రివర్యులు పున్నం ప్రభాకర్, , సర్దార్ సర్వాయి పాపన్న సగ్రామమైన సర్వేపేటలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ నియోవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నగంటి మల్లన్న, మార్కెట్ చేర్మెన్ ఎర్రం సతీష్ రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, గూడెపు సారంగపాణి, సాయిని రవి, బొంగుని వీరన్న, శ్రీపతి నరేష్ , పొనగంటి సారంగం, పొన్నగంటి రాము, ఎలగందులశ్రీహరి, జమ్మికుంట పట్టణ మహిళా అధ్యక్షులు పూదరి రేణుక శివ,పంజాల అజయ్, గడ్డం దీక్షిత్ గౌడ , శ్రీపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సునీల్ సూర్యా సంఘం నాయకులు అరెల్లి మల్ల గౌడ్,రామ్మూర్తి గౌడ్,నాగపురి సాయిలు, నాగపురి ప్రభాకర్, ముఖ్యర విజయ్, శ్రీపతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.