Listen to this article

జనం న్యూస్ 14 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ న్యూస్ ప్రతినిధి ) రాయకుర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్ తనవంతు సహకారం గా ఆలయ నిర్మాణానికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా విరాళం ఇచ్చే అదృష్టం రావడం సంతోషంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు. అనిల్ పటేల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమంలో ఎల్లప్పుడు ముందు ఉంటారని రాయకుర్ గ్రామస్తులు ఆయన సేవలును కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారం, ఉప సర్పంచ్ గంగారం, ముదిరాజ్ కమిటీ సభ్యులు కాంతపు సాయిలు, శంకర్, వీరయ్య, రాధా సంగయ్య తదితరులు ఉన్నారు.