

ఈ పథకము దేశ చరిత్రలో నిలిచిపోతుంది భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా దీన్ని రద్దు చేయలేరు దొడ్డు బియ్యము పేదల కడుపునింపలేదని
కెసిఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా
జనం న్యూస్ 3ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ నాయకులు పోడేటి రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా ఈ పథకాన్ని రద్దు చేయలేరని చెప్పారు ఆనాడు ఇందిరా గాంధీ రోటి కప్పుడా మఖాన్ అనే నినాదంతో పేదవారికి కడుపునిండా అన్నము గుడ్డ ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 25 లక్షల ఎకరాలను పేదలకు పంచారని గుర్తు చేశారు దాంతో పేదల్లో చైతన్యం వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండించాలని నేడు అదే స్ఫూర్తితో తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు ఆనాడు పేదలు పండుగనాడే కాకుండా ప్రతిరోజు తెల్ల బువ్వ తినాలని ఉద్దేశంతోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక రూపాయి 90 పైసల కిలో బియ్యం పథకం తెచ్చారని అయితే ఎన్నికల కారణంగా అది అమలు కాలేదని చెప్పారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం మొదలుపెట్టిన దొడ్డిబియ్యం పంపిణీ పథకమే ఇప్పటివరకు కొనసాగిందని అన్నారు దొడ్డు బియ్యం పేదల కడుపు నింపడం లేదని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పేదలంతా తినేలా తాము సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు ఇకనుంచి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చి ప్రతిరోజు పండగల పేదవాడి కడుపు నింపాలన ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామని చెప్పారు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి కొక్కుల నరేష్ సమ్మయ్య ఇసుక మల్ల శ్రీనివాస్ రామ్ రెడ్డి ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు