

ఆరుగురు సభ్యులతో ఐదు బృందాలుగా 30 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ ఏప్రిల్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి, జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా శక్తి టీమ్స్ ను నియమించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శక్తి టీమ్స్ నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకుగాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ‘శక్తి టీమ్స్’ ను జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్ళును (హాట్ స్పాట్స్ ను) మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయి లను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతరన్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, పరవాడ మరియు నర్సీపట్నం పట్టణాలలో ఆరుగురు పోలీసు సిబ్బందితో ఐదు బృందాలుగా మొత్తం 30 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కొక్క బృందానికి ఎస్సై నాయకత్వం వహిస్తారన్నారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్ కు వచ్చే ఎస్.ఓ.ఎస్.కాల్స్, డయల్ 112/100 కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్ధలంకు చేరుకొని సమస్యలను చట్టబద్దంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శక్తి టీమ్స్ ను ఆదేశించారు. మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, వారి మొబైల్స్ లో యాప్ నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషను చేయాలన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని విద్యార్థిని లకు, మహిళలకు వివరించాలన్నారు. ఈ బృందాల పని తీరును జిల్లాలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ పర్యవేక్షిస్తారని, మహిళా పి.ఎన్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు నోడల్ అధికారిగా ఉంటారన్నారు. అంతేకాకుండా, శక్తి టీమ్స్ ను రాష్ట్ర డిజిపి కార్యాలయం కూడా పర్యవేక్షిస్తుందని, వారి ఆదేశాల మేరకు పని
చేయాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శక్తి టీమ్స్ కు దిశా నిర్ధేశం చేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, మహిళా పి.ఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, సి.ఐ చంద్రశేఖర్, ఎస్సై మనోజ్ కుమార్ మరియు శక్తి టీమ్స్ సభ్యులు పాల్గొన్నారు.