Listen to this article

జడ్జి ప్రియాంక చేతుల మీదుగా రామకోటి రామరాజుకు అందజేత

కోటి తలంబ్రాల కార్యక్రమం ఒక అద్భుత గట్టం

రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘమన్న

గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక

జనం న్యూస్, ఏప్రిల్ 3( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్(

భద్రాచల సీతారాముల కళ్యానానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి గత 40రోజుల నుండి గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గ్రామ, గ్రామాన తిరిగి ప్రతి భక్తునిచే రామ నామాన్ని స్మరింపజేసి. 250కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేపించి రాముని మీద ఉన్న అపారమైన రామభక్తిని చాటుకున్నాడు గజ్వేల్ వాసి రామకోటి రామరాజు ఈ కార్యక్రమాని సివిల్ జడ్జి ప్రియాంక గారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లోని త్రిశక్తి ఆలయంలో పూజలు జరిపి 250కిలోలకు సంబందించిన కళశాలను సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామకోటి రామరాజు గారు చేపట్టిన గోటి తలంబ్రాల కార్యక్రమం అద్భుతం అని కొనియాడారు. మూడోసారి భద్రాచల రాముని కల్యానానికీ గోటి తలంబ్రాలు లక్షల మంది భక్తులచే ఓలిపించి అందించడం, లక్షల మంది భక్తులచే రామకోటి వ్రాయించడం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం అని కొనియాడారు.మా చేతులు మీదుగా భక్తితో ఓలిచిన తలంబ్రాలు సాక్షాత్తు రామయ్య కళ్యానానికి వెళ్లడం వెళ్లడం మా అదృష్టం అన్నారు. 250కిలోల తలంబ్రాలలో నా వంతుగా ఓలిచి అందించే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో త్రిశక్తి ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.