

డి.ఎస్.పి, జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్
జనం న్యూస్, ఏప్రిల్ 4( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ కుమార్)
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న విశారదన్ మహారాజు,ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ధర్మసమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది.ఆవిష్కరణ అనంతరం ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ మరియు రాష్ట్ర కార్యదర్శి రవిబాబు మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, అనగారిన వర్గాల ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని కలిగించి, రాజ్యాధికారాన్ని సాధించడం కోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ మరియు ధర్మసమాజ్ పార్టీ ల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రకి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ రథయాత్ర ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమై మూడు సంవత్సరాల మూడు నెలల పాటు 33 జిల్లాల మీదుగా కొనసాగి ప్రజా సమస్యల మీద పోరాడుతూ అణగారిన వర్గాల రాజ్యాధికార లక్ష్యం దిశగా సాగుతుందని అన్నారు. ఈ యాత్రని విజయవంతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ,ఎస్సీ, ఎస్టీ, అనగారిన వర్గాల ప్రజలు, మేధావులు, బుద్ధి జీవులు, ప్రజాస్వామ్యవాదులు, అగ్రకులాల్లో ఉన్న పేదలు అందరూ కలిసి రావాలని ఏప్రిల్ 14 ఆదిలాబాద్ లో జరిగే ప్రారంభ సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జ్యోతి, జిల్లా నాయకులు డిబి రాజు, ర్యాగట్ల చందు, చంచల ఎల్లన్న, మల్లేశం, సిద్దు, ధర్మ స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి లింగాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
