Listen to this article

జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3

తర్లుపాడు మండల తర్లుపాడు హిందూ స్మశాన అభివృద్ధికి తర్లుపాడు మండల ప్రజల అవసరార్థం చనిపోయిన వ్యక్తులను భద్రపరిచే ఏసీ ఫ్రిజర్ బాక్స్ ని తర్లుపాడు గ్రామ వాసి , వాసవి సత్ర సముదాయాల జాయింట్ సెక్రెటరీ పోలేపల్లి జనార్దన్ రావు వారి తల్లితండ్రులు క్రి శే పోలేపల్లి వెంకట రామయ్య వీరి ధర్మపత్ని బాలమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు.ఆధునిక సౌకర్యాలు కల్గిన ఒక లక్ష రూపాయల విలువైన ఏసీ ఫ్రీజర్ బాక్స్ ని హిందూ మహాప్రస్థానం అభివృద్ధ కర్త ,ఉపాధ్యాయుడు కశ్శెట్టి జగన్ కి అందించారు.పలువురు సేవాదాతృత్వం చాటుకున్న పోలేపల్లి జనార్ధన్ ని అభినందనలు తెలిపారు ఈ ఉచిత ఫ్రిజర్ సౌకర్యాన్ని ప్రతి ఒక్క హిందువులు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. కావాల్సిన వారు సంప్రదించవలసిన వ్యక్తి:
కశ్శెట్టి జగన్. 9885021929ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయభాస్కర్ రావు , నేరెళ్ల సాంబశివరావు , దొగిపర్తి మల్లికార్జున రావు, చినమనగొండ శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు