

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
మన గృహాల్లో జరిగే శుభకార్యాలను విలాసవంతంగా ఘనంగా నిర్వహించుకుంటామని కానీ మన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలు నిరాశలను గుర్తించి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించటం మనందరి బాధ్యతని అప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందని కొరిసపాడు తాసిల్దార్ జీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు గురువారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టి ఐ మేదరమెట్ల బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం(దిషా) మార్టూరు అవుట్ రిచ్ వర్కర్ కె దుర్గా కుమార్తె కె. ఓ సుకన్య సతీష్ చౌదరి మొదటి సంవత్సరపు వివాహపు వేడుక పురస్కరించుకుని కొరిసపాడు నాగులపలపాడు మండలాల్లోని హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత నిరుపేద మహిళలకు నూతన వస్త్రాలు పండ్లు పంపిణీ చేయు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొరిశపాడు తాసిల్దార్ జి. వి సుబ్బారెడ్డి ముఖ్య అతిక్రమాలుని బాధిత మహిళలకు నూతన వస్త్రాలు నిత్యవసర సరుకులు పండ్లు పంపిణీ చేయడం జరిగినది హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మేదరమెట్ల టి ఐ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని మనకున్న దానిలోనే మన చుట్టూ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి మన వంతు సహాయ సహకారాలు అందించాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి యు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేస్తున్నారని ఇంక మెరుగైన సేవలు అందించి రాబోయే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులేని సమాజాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని దీనికోసం మన క్షేత్రస్థాయిలో నిరంతర కృషి చేయాలని ప్రభుత్వం అందించే వైద్య సేవలు గురించి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు సామాన్యులు అవగాహన కలిగించాలని విచ్చలవిడి శృంగారానికి అందరూ దూరంగా ఉండాలని సురక్షితమైన శృంగారానికి తప్పకుండా అందరూ కండోమ్ వినియోగించాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి జాతీయ టోల్ ఫ్రీ 1097 పై ఒక్కరికి అవగాహన ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్ప్ టి ఐ మేదరమెట్ల ప్రోగ్రాం మేనేజర్ డి.సిహెచ్. కోటేశ్వరావు, ఎం. ఈ.ఏ టి అనిల్ అద్దంకి, మార్టూరు, కొరిశపాడు, నాగులప్పలపాడు మండలాల హెల్ప్ ఔట్రిచ్ వర్కర్స్ కే దుర్గా,ఎం మల్లేశ్వరి, సామ్రాజ్యం, కృష్ణవేణి, టి. భవాని ఏ. ఎన్ ఎం జె. రాద్దమ్మ తదితరులు పాల్గొన్నారు