Listen to this article

మున్సిపల్ కమిషనరును ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని

జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )

కొత్తగూడెం/పాల్వంచ : కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీల పరిధిలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కమిషనరును ఆదేశించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఇంచార్జి కమిషనర్, పాల్వంచ కమిషనరైన సుజాతకు మంగళవారం ఫోన్ చేసి పలు సూచనలు చేశారు. శ్రీరామ నవమి సందర్బంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా వేలాది మంది భక్తులు భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి వచ్చి పోతుంటారని, వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరిసర గ్రామాల నుంచి వివిధ పనులపై కొత్తగూడెం జిల్లా కేంద్రానికి, పాల్వంచ పట్టణానికి వచ్చే ప్రజలు తాగునీరు కోసం ఇబ్బందిపడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వచ్చంద సంస్థలు, సంఘాలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని సూచించారు