

జనం న్యూస్ ఏప్రిల్ 4 కాట్రేనికోన
బుధవారం పాత్రికేయులు విద్యార్థుల అవసరతను దృష్టిలో పెట్టుకుని కాట్రేనికోన మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు సమయపాలన పాటించటం లేదని మాకు ఉన్న సమాచారం మేరకు కాట్రేనికోన ప్రెస్ మరియు ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూపు నందు మండల విద్యాశాఖ అధికారికి తెలియజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సమయనికి రావడం లేదని చెప్పినందుకుగాను మండల విద్యాశాఖ అధికారి విలేకరులను సంబోధిస్తూ వస్తున్నారా రావట్లేదు ఆన్లైన్లో పై అధికారులు కనిపిస్తుంది అతిగా స్పందించొద్దు అంటూ మమ్మల్ని కించిపరిచి సమాజం కోసం ప్రజల అభ్యున్నతికి ఏటువంటి ప్రతిఫలం ఆశించకుండా మంచి చెడులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసి పాత్రికేయులను కించుపరుస్తూ మా వృత్తిని అవమానపరుస్తూ మండల మండల అధికారుల ముందు మా వ్యక్తిత్వాన్ని అవమానపరిచినటువంటి సదరు మండల విద్యాశాఖ అధికారి మాచగిరి వెంకటరమణ పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని మండల పాత్రికేయులు కాట్రేనికోన ఎంపీడీవో కి వినతి పత్రాన్ని రాత పూర్వకంగా తెలియజేశారు. భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం ప్రకారం ప్రజలకు ఉచిత విద్య అందించాలని రాజ్యాంగం ప్రకారం అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తూ ప్రజల మన్నులలు పొందుతుంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన విద్య వ్యవస్థకు అండగా ఉండాల్సిన అధికారులు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తెలియజేసిన పాత్రికేయులు మీద దురుసుగా విచక్షణ రహితంగా నోటికి ఇష్టం వచ్చినట్లు పాత్రికేయులందరు సదరు ఎంఈఓ 2 మాచగిరి వెంకటరమణ చెప్పు చేతల్లో ఉన్నట్లు మాట్లాడటం పట్ల నిరసిస్తూ సదరు విషయాన్ని ఉన్నత అధికారులకు తెలియజేసి జరిగిన విషయంపై విచారణ చేసి అసలు మండల విద్యాశాఖలో ఏం జరుగుతుంది. 2/4/2025 తేదీన మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయానికి వచ్చారా లేదా ఎంఈఓ టూ పై చర్యలు తీసుకోవాలని కాట్రేనికోన మండల పాత్రికేయులు ఎంపీడీవో ఆఫీస్ లో నిరసన తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో కి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలోఅయితాబత్తులశ్రీనుబాబు, గిడ్ల శ్రీనివాస్,పసల నాయుడు,పెయ్యాల వెంకటరమణ,బ్రహ్మాజీ,చక్రి,శ్రీహరి,నెలపాటి నానిబాబు, అయితాబత్తుల పండుబాబు తదితరులున్నారు