

జనం న్యూస్ // ఏప్రిల్ // 4//కుమార్ యాదవ్// జమ్మికుంట..
హుజురాబాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ లో క్రితం సంవత్సరం బార్ అసోసియేషన్ వారి కాలము పూర్తి అయినందున వారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వనందున తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు, నల్ల భూమిరెడ్డి, కంకణాల అమరేందర్ రెడ్డి, సికె. జేమ్స్ మరియు నక్క సత్యనారాయణ అడ్వకేట్స్ తో ఒక అడ్ హాక్ కమిటీ వేసి ఎలక్షన్ నిర్వహణకు ఆదేశించారు,ఇట్టి ఎలక్షన్ ప్రక్రియలో ప్రెసిడెంట్ పోస్టుకు యతిపతి అరుణ్ కుమార్ మరియు బండి కళాధర్ నామినేషన్ దాఖలు చేసీ పోటీలో ఉన్నారు. జనరల్ సెక్రెటరీ పోస్ట్ కు బండి రమేష్, ఎర్రోళ్ల రమేష్, మరియు కామని సమ్మయ్య దాఖలు చేసి పోటీలో ఉన్నారు,కాగా వైస్ ప్రెసిడెంట్ గా నూతల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ పదవికి పి. రాజేష్, లైబ్రరీ సెక్రటరీ గా సిహెచ్. భాను కిరణ్, ట్రెజరరీ గా బి. కుమారస్వామి, స్పోర్ట్స్ మరియు కల్చరల్ సెక్రటరీ గా ఇరుమండ్ల జయపాల్, సీనియర్ ఈసీ మెంబర్ గా బండి రవీందర్, జూనియర్ ఈసి మెంబర్ గా టి. రవి, లేడీ ఈసీ మెంబర్ గా సి. శిరీషను హుజురాబాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.