Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)

హత్నూర మండలంలోని సిరిపుర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆసిఫ్ హుస్సేన్ అందోల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా బొకేతో సన్మానించారు. తనను అందోల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమించినందుకు జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి. డి సీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం ఏ. హకీమ్ కొల్చారం మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్. ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు చార్ల మణిదీప్. సిరిపుర గ్రామ అధ్యక్షులు బిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.