

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యూత్ వింగ్ సెక్రెటరీ కొండా శివశంకర్ రెడ్డి.
అర్ధవీడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత కొండా శివ శంకర్ రెడ్డి.
జనం న్యూస్, ఏప్రిల్ 04 (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి):-
గిద్దలూరు: ముస్లిం మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ పార్లమెంట్ లో వక్స్ సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యూత్ వింగ్ సెక్రెటరీ కొండా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వక్స్ బిల్లును రాష్ట్రంలోని టీడీపీ జనసేన పార్టీలు సమర్థించగా, వైఎస్సార్ సీపీ వ్యతిరేకించింద న్నారు. గతంలో కూడా మైనార్టీల అభ్యున్నతికి వైఎ స్సార్ సీపీ చేయూతనిచ్చిందన్నారు. ముస్లింల స్థితి గతులు మార్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశే ఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ ముస్లింలను విద్యావం తులుగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థికంగా, రాజకీ యంగా, సామాజికంగా ముందుకు నడిపారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించగా, వైఎస్సార్ సీపీ మాత్రం గౌరవించిందన్నారు. ముస్లిం సమాజం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటుందని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి వైఎస్ జగన్ అత్యధికంగా నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో షాదీఖానాల నిర్మాణానికి కోట్ల రూపా యల నిధులను కేటాయించినట్లు తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సైతం నిధులు కేటాయించారన్నారు. వక్స్ సవరణ బిల్లును ఉపసంహరించుకుని, ముస్లింల మనోభావాలను గౌరవించాలని కొండా శివ శంకర్ రెడ్డి కోరారు.