Listen to this article

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ డిమాండ్

జనం న్యూస్,ఏప్రిల్04, అచ్యుతాపురం:


అచ్యుతాపురం పై వంతెనకు పిల్లర్ తవ్విన ప్రాంతంలో ఎస్విఆర్ డ్రగ్స్ పరవాడ ఏ షిఫ్ట్ కి విధులకు వెళుతున్న బగాది రమణారావు నేవీకి బండరాయి తరలించి వస్తున్న లారీ క్రింద దుర్మరణం చెందారని, రమణారావుకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, వీరి కుటుంబాన్ని లారీ మరియు పరిశ్రమ యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ .రాము డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని భారీ వాహనాలు పై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు