

జనం న్యూస్,ఏప్రిల్04, అచ్యుతాపురం:
టిడిఆర్ బాండ్లు పై చోడపల్లి సచివాలయంలో ఆవగాహన కల్పించడానికి వచ్చిన ఆర్డీవోకి
టిడిఆర్ బాండ్లు వద్దు నష్టపరిహారం ఇచ్చి పునరావసం కల్పించాలని నిరసన తెలియజేసి ఆర్డీవోకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్. రాము,ఎస్. బ్రహ్మాజీ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం,పునరావసం కల్పించేలాగా భరోసా ఇచ్చి న్యాయం చేయాలని టిడిఆర్ బాండ్లు ప్రతిపాదనలను విరమించుకోవాలని,రోడ్డు నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా బాండ్లు పేరుతో మోసం చేస్తున్నారని గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ ల వారిగా రూ.15వేలు నుండి రూ.25వేలు గజానికి ఇస్తామని అందరితో సంతకాలు చేయించుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులను రోడ్డున పడే విధంగా బాండ్లు ఇస్తామనడం అన్యామని నిర్వాసితులకు బాండ్లు వద్దు నగదు ఇవ్వాలని సమావేశం నుండి నిర్వాసితులు బయటికి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు నిర్వాసితులు పాల్గొన్నారు.