

జనం న్యూస్ 15.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట. చేగుంట మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు డ్రైవర్ గురువేశం కూతురు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ అయిత పరంజ్యోతి ఆర్థిక సాయం అందజేశారు. బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఆడెపు రాజమణి ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న పరంజ్యోతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు సాయంగా అంత్య క్రియల కోసం 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యాకల రవికుమార్, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు చింతల సిద్ధిరాములు, నాయకులు మ్యాకల శ్రీనివాస్, మ్యాకల నాగులు, తలకొక్కుల అశోక్, తుమ్మల వెంకటేష్, చిన్న డిష్ రాజు, బిక్షపతి, తిరుపతి,వెంకటేష్,సాలిపేట పోషాద్రి,భూములు సాయిలు తదితరులు ఉన్నారు