Listen to this article

జనం న్యూస్- ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

నాగార్జునసాగర్ జలాశయంలో మత్స్యకారుల కుటుంబాలు చేపలవేట చేస్తూ జీవనం కొనసాగిస్తునారు, జలాశయంలో గత కొంతకాలంగా చేపలవేట విధానంలో అనేక మార్పులు రావడంతో నదిలో క్రమక్రమంగా మత్స్య సంపద అంతరించిపోయే ప్రమాదాలు ఉన్నాయి అని పలుమార్లు మత్స్యకార సంఘాల నాయకులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు,ఇందులో భాగంగా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన చోడిపల్లి దేవుడు,వయస్సు 45 సంవత్సరాలు,అతను గత 30 సంవత్సరాలుగా నాగార్జునసాగర్ జలాశయంలో చేపల వేట చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు,అతనికి ముగ్గురు అమ్మాయిలు,గత ఐదు సంవత్సరాల నుంచి నదిలో చేపల వేట క్రమంగా తగ్గడంతో జీవన ఉపాధి లేక మూడు సంవత్సరాల క్రితం అతని భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని అతని దగ్గర నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది,అతను వాళ్ళ అమ్మ దగ్గర జీవనం కొనసాగించే వారు,చేపలవేట విధానంలో అనేక మార్పులు రావడంతో జీవన ఉపాధి సరిగ్గా లేక మనస్థాపానికి గురై శుక్రవారం చోడిపల్లి దేవుడు తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు,ఈ సంఘటన తెలుసుకున్న అతని అమ్మ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు,పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కమల నెహ్రూ ఏరియా హాస్పిటల్ కు తరలించారు, అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు.