

జనం న్యూస్ జనవరి 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ… ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక గ్రామంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభించిన నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి దాడి వీరభద్రవులు జండా ఊపి ప్రారంభించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎడ్లబండి ప్రదర్శన పోటీలు గుర్రపు స్వారీ పోటీలతో మండల ప్రజలను మంత్రముగ్ధు లయ్యారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్క గ్రామంలో ఉన్న సుమారుగా 10 వేల మందికి పైగా తండోపతండాలుగా తరలివచ్చారు. సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతులకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్ తనయుడు రిత్విక్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు దాడి రత్నాకర్, ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నడి వీరభద్రరావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై ప్రసాద్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పార్లమెంటు నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోటీల అనంతరం ఎడ్ల బండి ప్రదర్శన గురక స్వారీ ప్రదర్శన పోటీల్లో గెలుపొందిన వారికి ఎంపీ రమేష్ ఎమ్మెల్యే సుందర్ విజయకుమార్ చేతుల మీదుగా అవార్డులను నరుదును అందజేయడం జరిగింది.