

జనం న్యూస్- ఏప్రిల్ 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ వాసులకు వెలగని వీధిలైట్లతో తిప్పలు తప్పట్లేదు, నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఆరు వార్డులలో చాలా చోట్ల వీధిలైట్లు వెలుగక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు, నిర్వహణ లోపంతో కొన్నిచోట్ల పగలు కూడా వీధిలైట్లు వెలుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్వహణ లోపంతో కొత్తవి అమర్చిన కొంతకాలానికి వెలగకుండా పోయాయి, వీధిలైట్లు స్విచ్ ఆన్ చేసేవారు లేక స్థానిక కాలనీవాసులే వీధిలైట్లు స్విచ్ ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి, విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యం, గత ప్రభుత్వంలో వీధిలైట్ల నిర్వహణ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేసిన వైనం, అటవీ ప్రాంతం కావడంతో పాములు, విష పురుగులు సంచరిస్తుండడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు, కాలనీలో కోతుల బెడద అధికమవడంతో, కోతులు చీకట్లో వెళ్లే వారి మీద దాడికి దిగుతున్నాయని కోతుల భయంతో చీకట్లో వెళ్లాలంటేనే కాలనీవాసులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి వీధిలైట్లు వెలిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.