

జనం న్యూస్ 15 బుధవారం 2025. మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట మండల కేంద్రానికి చెందిన ఆడేపు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ కుటుంబానికి పరామర్శించి 5000 ఆర్థిక సహాయం అందజేశారు . ఈ కార్యక్రమంలో సండ్రుగు రాజు ,ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు చింతల సిద్ధిరాములు, విజయ్, శేఖర్, పోషద్రి,సురేశ్, సంజు, సూరజ్, తదితరులు ఉన్నారు.