

జనం న్యూస్ 15 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) పరిగి మున్సిపాలిటి బాలాజీ నగర్ లోని మైత్రి కాలనీ యందు బాల్ బ్యాడ్మెంటన్ , మరియు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మరియు పరిగి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, బాల్ బ్యాడ్మెంటన్ అసోసియేషన్ మరియు ప్రతిరోజు రోడ్లపై వాకింగ్ చేస్తున్నటువంటి కాలనీ వాసుల కోరిక మేరకు ,బాల్ బ్యాట్మెంటన్ కోర్టు మరియు వాకింగ్ ట్రాక్ ను దగ్గరుండి వేయించి మున్సిపాలిటీ బాలాజీ నగర్ లోని మైత్రి నగర్, తిరుమల కాలనీ మధ్యలో ఉన్న పార్కులో బాల్ బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించడం జరిగింది. మరియు ఆటను ప్రారంభింపజేసి మరియు అదే అదే పార్క్ లో వాకింగ్ ట్రాక్ ని కూడా వేయించిన DCC ప్రధాన కార్యదర్శి, TJMU TSRTC రాష్ట్రప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ గారికి ధన్యవాదాలు తెలిపి, సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆటలను మరియు వాకింగ్ ను అలమర్చుకోవాలని రోజు వారి దిన చర్యలో భాగంగా చేసుకొని వీటిని ప్రతి ఒక్కరు పాటించి ఆరోగ్యానికి కాపాడుకోవాలని సూచించారు. వాకింగ్ ద్వారా ఆటల ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను పొందుతారని అన్నారు. మరియు ఇతరులకు ఆదర్శంగా ఉంటారని తెలిపారు. ఇట్టి విషయంలో గౌరవ శాసనసభలు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి ఈ యొక్క పార్కులో ఓపెన్ జిమ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయడానికి ఇక్కడ బోరు మరియు ఇమాక్స్ లైట్లు తదితర అవసరాలు అరేంజ్ చేయించాలని కోరగా పది లక్షల రూపాయలకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్, రాములు, MEO హరిలాల్, చెట్టుకింది సత్యం , పాషా, నర్సింలు,లక్నాపూర్ శ్రీనివాస్, ఎక్స్ సర్వీస్మెన్ రామలింగం, కావలి శ్రీశైలం, కనిశెట్టి శ్రీశైలం, జాక శ్రీశైలం, సాగర్, ఖదీర్, శంకర్రావు, లక్ష్మయ్య,నరేందర్,యాదయ్య, బసప్ప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు