

బిచ్కుంద ఏప్రిల్ 7 :-జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం దౌల్తాపూర్ గ్రామంలో విష జ్వరాలు ప్రభలడంతో ప్రజలు చలి జ్వరం, ఒంటి నొప్పులు,కీళ్ల నొప్పులు, తలనొప్పితో బాధపడుతుండగా. విషయం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దృష్టికి రాగానే వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించారు. వైద్య బృందం అనారోగ్యానికి గురైన వారి ఇంటికి వెళ్లి పరీక్షలు చేసి, వైద్యం అందించి, మెడిసిన్ అందజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ప్రజలకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంతో గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు..

