Listen to this article

జనం న్యూస్ 07 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో హనుమాన్ దేవాలయం ముందు శ్రీ పట్లోళ్ల రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యుల సహకారం తో నిర్మించిన శౌచాలయాలు  4.5 లక్షల ఖర్చు తో  శ్రీ పట్లోళ్ల తిరుమల రెడ్డి మరియు గ్రామస్థుల సమక్షంలో ప్రారంభం చేయించడం జరిగింది. గ్రామం లో జరిగే అన్ని కార్యక్రమాలకు వచ్చే భక్తుల శుచి శుభ్రత ఇబ్బందులు గమనించి వారి సౌకర్యార్థం నూతన శౌచాలయల నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.